మిథునం
సన్నిహితుల సాయం పొందుతారు.
కార్యక్రమాలలో విజయం.
ఆలోచనలు కలసివస్తాయి.
చిరకాల స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
ఆదాయం గతం కంటే మరింత అనుకూలిస్తుంది.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో వివాదాలు తీరతాయి.
ఆరోగ్యం విషయంలో గతం కంటే మెరుగుపడుతుంది.
వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి.
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు దక్కుతాయి.
రాజకీయ, కళారంగాల వారు సత్తా చాటుకుని విజయాల వైపు సాగుతారు.
క్రీడాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
వారం మధ్యలో వృథా ఖర్చులు.
కుటుంబంలో చికాకులు.