వృషభం
ఇంతకాలం పడిన కష్టాలు, ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి.
కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.
బంధుమిత్రుల ఆదరణ, ప్రేమ పొందుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి.
కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
వివాహయత్నాలలో పురోగతి సాధిస్తారు.
వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా దక్కుతాయి.
ఉద్యోగులకు సహచరుల తోడ్పాటు లభిస్తుంది.
అపవాదుల నుంచి బయటపడతారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుతాయి.
వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు.