ధనుస్సు...
------
ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. శారీరక రుగ్మతలు కొంత బాధించవచ్చు. తరచూ ప్రయాణాలు సంభవం. విలువైన పత్రాలు జాగ్రత్తపర్చుకోండి. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార సంస్థలు అనుకున్న లాభాలు దక్కించుకుంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు పురస్కారాలు, సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధననష్టం. కుటుంబంలో సమస్యలు.