కన్య
కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు.
ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు కృషి చేస్తారు.
కాంట్రాక్టర్ల యత్నాలు సఫలమవుతాయి.
వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కించుకోవడంలో సఫలం చెందుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
రావలసిన డబ్బు అందుతుంది. రుణ దాతల ఒత్తిడుల నుండి గట్టెక్కుతారు.
కుటుంబంలో అందరి ఆదరణను చూరగొంటారు. భార్యాభర్తల మధ్య కొంత కాలంగా నెలకొన్న స్పర్థలు తొలగుతాయి.
ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వైద్యసేవల నుండి విముక్తి లభిస్తుంది.
వృత్తులు, వ్యాపారాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మహిళలకు కుటుంబంలో మంచి గుర్తింపు రాగలదు.
19,20 తేదీల్లో బాధ్యతలు పెరుగుతాయి.
శ్రమ తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు.