మకరం
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.
సంఘంలో మీరంటే గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి.
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిలో పడతారు.
వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకునేందుకు యత్నిస్తారు.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మీకు చేయూతనిస్తారు.
ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తి.
కుటుంబ సమస్యలు క్రమేపీ తొలగుతాయి ప్రశాంతత చేకూరుతుంది.
భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొని సంతోషంగా గడుపుతారు.
ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు.
వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
భూములు కొనుగోలుపై బేరసారాలు సాగిస్తారు.
వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరి నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
ఉద్యోగులు ఒక సంతోషకర సమాచారం అందుకుంటారు.
వైద్యులు, రాజకీయవేత్తలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తారు.
కళాకారులు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.
టెక్నికల్ రంగం వారి ఆశలు ఫలించే సమయం. ఇబ్బందులు అధిగమిస్తారు.
మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాలు పఠించండి.
పక్షులకు చిరుధాన్యాలు పెట్టండి.