మిథునం
ముఖ్య కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేస్తారు.
మీ సహనం, మనోనిబ్బరం మీకు ఆయుధాలు కానున్నాయి.
విద్యార్థులకు అనుకూల ఫలితాలు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
సంఘంలో గౌరవమర్యాదలు విశేషంగా దక్కించుకుంటారు.
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.
ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు వెనుకాడరు.
సొమ్ముకు లోటు లేని విధంగా అడుగులు వేస్తారు.
దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.
వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
ఒకరి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు.
బంధువులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది.
మీ పై అందరికీ సదభిప్రాయం నెలకొంటుంది.
ఆరోగ్యం కొంత మందగిస్తుంది.
వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడి లాభించి ఉత్సాహవంతంగా సాగుతాయి.
వ్యాపారస్తులు కొత్త భాగస్వాముల ఎంపికలో మాత్రం తొందరపడరాదు.
ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, అయితే విధులు నిర్వహణలో అప్రమత్తత అవసరం.
అధికారుల దృష్టి మీ పై ఉండగలదు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు.
మహిళలకు సోదరులు, సోదరీలతో సఖ్యత.
విష్ణు ధ్యానం చేయండి.