మిథునం
చేపట్టిన కార్యాలలో విజయం. పలుకుబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.
బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది.
మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు.
రాబడి అనుకున్నంతగా లభించి సంతృప్తికరంగా ఉంటుంది.
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం.
కాంట్రాక్టర్లు ప్రతిభను చాటుకుంటారు.
ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు.
వ్యాపారులకు మరింతగా లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ప్రమోషన్లు దక్కవచ్చు.
పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీయానం.
కళాకారులు సత్కారాలు అందుకుంటారు.
వారాంతంలో శారీరక రుగ్మతలు.
స్నేహితులతో తగాదాలు.