సింహం
ప్రత్యర్థులు మిత్రులుగా మారి మీకు విధేయులుగా వ్యవహరిస్తారు.
ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు.
విద్యార్థులు, నిరుద్యోగులు ఆశించిన అవకాశాలు పొందుతారు.
కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు.
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.
మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి.
ఊహించని విధంగా డబ్బు సమకూరుతుంది.
ఇతరులకు బకాయి పడ్డ సొమ్ము చెల్లిస్తారు. పొదుపు బాట పడతారు.
ఆస్తులు, షేర్ల విక్రయాల వల్ల మరింత సొమ్ము జత కలుస్తుంది.
అభిప్రాయాలు, నిర్ణయాలను అంతా ప్రశంసిస్తారు.
భార్యాభర్తల మధ్య మాత్రం కొద్దిపాటి వివాదాలు రావచ్చు.
ఇరువురు సహనంతో మెలగాలి.
ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊపిరి పీల్చుకుంటారు. వైద్య సేవలు తగ్గిస్తారు.
వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.
వీరు ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోవలసి ఉంటుంది.
మహిళలకు కుటుంబంలో ప్రత్యేక ఆదరణ లభిస్తుంది.
పూజించాల్సిన దైవం ఆంజనేయస్వామి.