తుల
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
పట్టుదలతో అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు.
మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు.
ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు.
తీర్థ యాత్రలు చేస్తారు.
కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
సొమ్ముకు ఇబ్బంది తీరుతుంది.
అవసరాలు తీరి మరింత సొమ్ము కొన్నింటిలో పొదుపు చేస్తారు.
కొన్ని రుణాలు సైతం తీరతాయి.
కుటుంబ సభ్యులు మీకు పూర్తిగా సహకరిస్తారు.
అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తారు.
భార్యాభర్తల మధ్య అపోహాలు, అపార్ధాలు తొలగుతాయి.
శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.
ఒక వ్యక్తి కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకునే వీలుంది. జాగ్రత్తపడండి.
ఆరోగ్యం, స్వల్ప అస్వస్థత కలిగినా ఉపశమనం పొందుతారు.
వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరణ దిశగా అడుగులు వేస్తారు.
భాగస్వాముల సలహాలు తీసుకుంటే మేలు.
ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. అలాగే, మార్పులు ఉండవచ్చు.
పై అధికారులతో వాగ్వాదానికి దిగవద్దు. చిక్కులు ఎదురవుతాయి.
కళాకారులు, పారిశ్రామికవేత్తలు లక్ష్యాలు సాధిస్తారు.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూతుంది.
దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయండి.