తుల
రాబడి కొంత పెరుగుతుంది.
ముఖ్య కార్యాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.
చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారే అవకాశం.
ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.
పాత విషయాలు గుర్తుకు రాగలవు.
వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
వ్యాపారులకు నూతనోత్సాహం, కొత్త హోదాలు రావచ్చు.
ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతిభ నిరూపించుకుంటారు.
కళాకారులు, క్రీడాకారులకు పురస్కారాలు అందుతాయి.
వారాంతంలో అనుకోని ఖర్చులు.
మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు.