మీనం
దూరపు బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం.
నిరుద్యోగుల శ్రమ ఫలించి ముందుకు సాగుతారు.
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.
వాహనాలు కొనుగోలు చేస్తారు.
వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది.
అప్పులు తీరే సమయం. అలాగే, పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతారు.
మొత్తం మీద గత రెండువారాల కంటే మరింత మెరుగ్గా ఉంటుంది.
ఎంతటి పరిచస్తులైనా హామీలు వద్దు. ప్రస్తుతం తగిన కాలం కాదు.
కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కుటుంబ సభ్యులంతా మీకు సహకరిస్తారు.
వివాహాది వేడుకల నిర్వహణలో భాగస్వాములవుతారు.
ఆరోగ్యపరంగా కొంత నలత తప్పకపోవచ్చు. అయితే వెంటనే ఉపశమనం పొందుతారు.
వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన పెట్టుబడులు అందుతాయి.
భాగస్వాములతో వివాదాఆలు తీరతాయి.
మీ హోదాలు మరింత పెరుగుతాయి. అనుకున్న సమయానికి మార్పులు పొందుతారు.
పారిశ్రామికవర్గాలు, కళాకారులకు నూతనోత్సాహం. సన్మానయోగం.
మహిళలకు ఊహించని విధంగా కుటుంబంలో తోడ్పాటు లభిస్తుంది.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.