ధనుస్సు
కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు.
సన్నిహితులు, మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు.
నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది.
పలుకుబడి మరింత పెరుగుతుంది.
ఆస్తుల వ్యవహారంలో నెలకొన్న వివాదాలు సర్దుబాటు కాగలవు.
భూములు, వాహనాలు సమకూరతాయి.
తీర్థయాత్రలు చేస్తారు.
కొంత సొమ్ము అప్రయత్నంగా సమకూరి అవసరాలు తీరతాయి.
దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు.
ఆస్తుల కొనుగోలుకు అడ్వాన్సులు చెల్లిస్తారు.
అత్యాశకు వెళ్లి సొమ్ము ఇన్వెస్టు చేయవద్దు.
మొదటికే మోసం రాగల సూచలు..
బంధువులు మీ పై ఉంచిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
మీ పట్ల కుటుంబ సభ్యులు సానుకూల వైఖరి చూపుతారు.
ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు దక్కించుకుంటారు.
పెట్టుబడులకు లోటు రాదు.
అలాగే భాగస్వాములతో వివాదాలు తీరతాయి
ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలమైన సమయం.
విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటే మంచిది.
మహిళలకు మానసిక ప్రశాంతత.
సూర్యారాధన మంచిది.