ధనుస్సు
ప్రారంభంలో కొన్ని వివాదాలు, సమస్యలు ఎదురుకావచ్చు.
అయితే పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగి వాటి అధిగమిస్తారు.
సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
సమాజంలో విశేష గౌరవం పొందుతారు.
రాబడి మరింత పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారులకు మరింత అనుకూల పరిస్థితులు.
ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు రాగలదు.
రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరం.
పరిశోధకులకు అవార్డులు రావచ్చు.
వారారంభంలో శారీరక రుగ్మతలు.
బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు.