వృషభం
ప్రధాన సమస్యల నుంచి గట్టెక్కుతారు.
మీ ఆలోచనలు కార్యరూపం ఇచ్చి లక్ష్యాలు సాధిస్తారు.
కార్యదీక్షతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుంటూ ముందుకు సాగుతారు.
డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.
తండ్రి తరఫు వారి నుంచి కూడా డబ్బు అందుకునే అవకాశాలు.
భూముల పై మాత్రం పెట్టుబడుల్లో తొందరపడకండి. నిదానం ప్రదానం.
భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి.
తల్లి తరఫు వారితో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు.
ఆస్తుల విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు.
ఒకరి విషయంలో మీ వ్యాఖ్యలు మానసిక బాధ కలిగించవచ్చు.
ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది.
వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం.
భాగస్వాముల సలహాలు తప్పకుండా పాటించండి. లేదా తరువాత పశ్చాత్తాపం తప్పదు.
ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.
విధులు కొంత తేలికపడి ఊరట చెందుతారు.
సమర్థత, నైపుణ్యం చూపినా ఏదో ఒక పొరపాటు చూపి పై అధికారులు నెపం వేయవచ్చు.
సమాధానం నేర్పుగా, సహనంతో చెప్పండి.
రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.
మహిళలకు కొన్ని సమస్యలు తీరతాయి.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.