కర్కాటకం
ఆదాయం –5,వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–2
వీరికి గ్రహసంచారం ప్రకారం ఆర్థికంగా అభివృద్ధి కనిపించినా ఏదో రూపంలో ఖర్చులు వెంటాడతాయి.
ఎప్పటికప్పుడు సొమ్ముల కోసం తాపత్రయం.
వైవాహిక జీవితంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొనవచ్చు.
మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ ఏకాగ్రత, ఓర్పు వహించడం ఉత్తమం.
అలాగే, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన వైద్య సలహాలు పొందుతూ ఉండండి.
కోర్టు వ్యవహారాలు అంతగా అనుకూలించక ఇబ్బంది కలిగించవచ్చు.
జ్ఞాతులతో విభేదాల వల్ల మానసిక అశాంతితో గడుపుతారు.
ప్రయాణాలలో కీలక పత్రాలు, వస్తువులు అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.
ఇక గురు సంచారం అనుకూలత వల్ల స్వగృహయోగం, అప్పడప్పుడు ధనలబ్ధి కలుగుతుంది.
అలాగే ఇంటిలో శుభకార్యాలు, తద్వారా ఖర్చులు ఉండవచ్చు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో నిదానంగా ముందుకు సాగుతూ వచ్చిన లాభాలతో సరిపెట్టుకోవాలి.
ఉద్యోగస్తులు ఎంత సమర్థవంతంగా విధులు నిర్వహించినా పై స్థాయి వారి నుంచి మాటపడాల్సిన పరిస్థితి. అయితే మొక్కవోని దీక్షతో ముందుకు సాగడం మంచిది.
పారిశ్రామిక,శాస్త్ర, సాంకేతికరంగాల వారు కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు.
రాజకీయవేత్తలకు తీవ్రమైన ఒత్తిడులు తప్పవు. కొందరికి పదవీయోగం ఉండవచ్చు.
చిత్రపరిశ్రమలోని వారు దక్కిన అవకాశాలతో సంతృప్తి చెందాలి.
విద్యార్థులు అనుకున్న ర్యాంకులు శ్రమానంతరం సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.
పరిహారాలు...వీరు శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
అదృష్ట సంఖ్య–2.