తుల
ఆదాయం–2, వ్యయం–8, రాజపూజ్యం–7, అవమానం–5
వీరికి ప్రధాన గ్రహాలైన గురు, శని, రాహుకేతువుల సంచారం అంత అనుకూలం కాదు. అయితే సంవత్సర ప్రారంభంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి.
ప్రారంభంలో గురుబలం వల్ల కొన్ని శుభ వర్తమానాలు అందుతాయి.
బంధువర్గం ద్వారా ఊహించని ధనలబ్ధి.
అపరిమిత ఆనందదాయకంగా గడుపుతారు.
కార్యదీక్ష, పట్టుదల పెరుగుతుంది.
ఏ కార్యక్రమం చేపట్టినా సత్తా చాటుకుని పూర్తి చేస్తారు.
మే, జూన్ నెలలు మరింత సానుకూలమైనవని చెప్పాలి.
ఈకాలంలో శుభకార్యాల నిర్వహణతో పాటు, వాటి కోసం ఖర్చు చేస్తారు.
ఆదాయమార్గాలు మెరుగుపడతాయి.
విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు.
నిరుద్యోగులకు ఒక వార్త ఒకింత సంతోషం కలిగిస్తుంది.
ఇక జూలై నుండి గురు బలం లేకపోవడం, ఇతర గ్రహాల ప్రతికూలత వల్ల కుటుంబ కలహాలు.
కావాల్సిన వ్యక్తులతోనే విరోధాలు.
ప్రతి విషయంలోనూ అనాసక్తి, భార్యావర్గం వారితో తగాదాలు.
కొన్ని వివాహాది కార్యక్రమాలు వాయిదా వేస్తారు.
రుణదాతల ఒత్తిడులు మీపై ప్రభావం చూపవచ్చు.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల కృషి కొంతమేర ఫలించి స్వల్ప లాభాలు దక్కవచ్చు.
ఉద్యోగస్తులు విధుల్లో మరింత అప్రమత్తంగా మెలగాల్సిన సమయం.
మీ ప్రమేయంలేకున్నా దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి.
పారిశ్రామికవేత్తలు, శాస్త్ర, సాంకేతిక రంగాల వారు అన్నింటా మరింత మెలకువ, ఓర్పు వహించడం ఉత్తమం.
రాజకీయవేత్తలు ఆశించిన అవకాశాలు దూరమై కలత చెందవచ్చు.
చిత్రపరిశ్రమ సహా కళాకారులు అంది వచ్చిన అవకాశాలు కూడా చేజారి నిరాశ చెందుతారు.
వ్యవసాయదారులకు పంటలు స్వల్పంగా లాభిస్తాయి.
ఇక నవంబర్ నుండి 2023 మార్చి వరకు కుజుడు వృషభం అంటే వీరికి అష్టమరాశిలో వక్ర స్థంభన వల్ల మానసిక ఆందోళన.
ఆరోగ్య సమస్యలు. అయినవారితో శత్రుత్వాలు కలుగవచ్చు.
అదృష్టసంఖ్య–5,
పరిహారాలు...వీరు గురు, శని, రాహుకేతువులతో పాటు నవంబర్లో కుజునికి పరిహారాలు చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన శ్రేయస్కరం.