వృశ్చికం
ఆదాయం–8,వ్యయం–14, రాజపూజ్యం–4, అవమానం–5.
వీరికి అర్థాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కుంభరాశిలో సంచారం వల్ల అప్పుడప్పుడు శుభత్వాన్నిస్తాడు.
అలాగే, మే 1వ తేదీ నుండి గురుడు సప్తమరాశిలో సంచారం శుభదాయకం.
ఇక రాహుకేతువులు పంచమ, లాభ స్థానాలలో సంచారం సామాన్యంగా ఉంటుంది.
వీరికి ఆర్థిక విషయాలలో ఎదురుండదు. ఎటువంటి ఖర్చునైనా అధిగమించగలుగుతారు.
కుటుంబంలో గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
మీ ఆశయాలు మంచివైనా వాటి సాధనలో కొందరు మోకాలడ్డుతారు.
అయినా పట్టుదల వీడకండి.
ఆస్తులు సమకూర్చుకోవడంలో నెలకొన్న స్తబ్ధత తొలగి ఊపిరిపీల్చుకుంటారు.
ఉద్యోగార్ధుల యత్నాలు కలసివస్తాయి.
దీర్ఘకాలికంగా నడుస్తున్న న్యాయపరమైన వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలు.
భవిష్యత్తు అవసరాలను గుర్తెరిగి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుంటారు.
విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే, ఇంటి నిర్మాణం, తల్లి ఆరోగ్యం వంటి విషయాలలో కొంత ఆదుర్దా కనిపిస్తుంది.
సంతానం విద్య, ఉద్యోగ విషయాలు కొంత ఆందోళనకు గురిచేస్తాయి.
ఊహించని వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో సహకరిస్తాయి.
ఒక సమాచారం కొన్ని మార్పులకు కారణమవుతుంది.
నవంబర్‌నెలలో వాహనాలు నడిపే వారు మరింత అప్రమత్తత పాటించాలి.
వ్యాపార సమృద్ధి. గతంలో లేని లాభాలు పొందుతారు.
ఉద్యోగస్తులు ఆశలు వదులుకున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలున్నాయి.
అలాగే, వీరు విధుల్లో సమర్థతను నిరూపించుకుంటారు.
రాజకీయవేత్తలకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు.
పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషి సఫలీకృతమవుతుంది.
కళాకారులు రెండుమూడు అవకాశాలు లభించి అగ్రిమెంట్లు చేసుకుంటారు. మరుగునపడిన వారికి గుర్తింపు లభిస్తుంది.
వ్యవసాయదారుల ఆశలు ఫలించి రెండు పంటలూ అనుకూలిస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో కొంత ఆందోళన తప్పదు.
మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి.
వైశాఖం, కార్తీకం, పుష్యమాసాలు మినహా మిగతావి విశేషంగా కలసివస్తాయి.
వీరు శనీశ్వరునికి పరిహారాలు చేయడం, చండీ పారాయణ మంచిది.