మిథునం
ఆదాయం –11, వ్యయం –5, రాజపూజ్యం–2, అవమానం–2.
ఈ రాశి వారికి గురుడు దశమంలో లోహమూర్తి కావడం వల్ల మానసిక ఆందోళన.
ఆదాయానికి ఇబ్బందులు, రుణాల కోసం తాపత్రయం.
ఇక శని నవమ, అష్టమస్థానాలలో సంచారం వల్ల శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.
రాహు, కేతువుల సంచారం విశేషంగా కలిసివస్తుంది.
మొత్తం మీద వీరు ధనం విషయంలోనూ, గౌరవమర్యాదల విషయంలోనూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మెలగాలి.
ఇతరులతో మాటలు పడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మౌనం మంచిది.
కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలు, మనస్పర్ధలు తప్పకపోవచ్చు.
ఏదో ఒక శారీరక రుగ్మత బాధిస్తూ ఉంటుంది. శారీరక ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.
ప్రతి విషయానికి భయాందోళనలు చెందుతారు.
న్యాయవాదులు, వైద్యులు, స్వయం వృత్తుల వారికి సమస్యలు పెరుగుతాయి.
సాంకేతిక రంగం వారికి మాత్రం అన్ని విధాలా సానుకూలమని చెప్పాలి.
ఆస్తులు, ఇతర న్యాయ వివాదాలలో రాజీ మార్గం శ్రేయస్కరం.
విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు బుద్ధికుశలత, సొంత తెలివితేటలతో ఇబ్బందుల నుండి బయపడి లాభాలు ఆర్జిస్తారు.
ఉద్యోగస్తులు జూలై తరువాత స్థాన చలన సూచనలు పొందవచ్చు.
అయితే మొదటి మూడునెలల కాలం వీరికి అన్ని విధాలా యోగదాయౖకం.
రాజకీయవేత్తలు ప్రత్యర్థుల నుండి తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కొంటారు.
పట్టుదలలకు పోవడం మంచిది కాదు.
ఇక చిత్రపరిశ్రమ, ఇతర కళారంగాల వారు పరీక్షాసమయం నుండి కొంతమేర గట్టెక్కుతారు.
అయితే నిర్ణయాలలో తొందరపాటు వద్దు.
వ్యవసాయదారులకు మొదటి పంట మెరుగ్గా ఉంటుంది.
పరిహారాలు...
వీరు గురు, శనులకు పరిహారాలు చేయించుకోవడం మంచిది.
అదృష్ట సంఖ్య–5.