కన్య
ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–4, అవమానం–5
గ్రహాల సంచారం ఆధారంగా పరిశీలిస్తే వీరికి చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది.
కార్యజయంతో ఉత్సాహంగా గడుపుతారు.
ఉన్నత వర్గాల వారితో పరిచయాలు.
ధనసంపదలు పెంచుకుంటారు.
రావలసిన బాకీలు చాలావరకూ వసూలై ఊరట లభిస్తుంది.
మీ ద్వారా సమాజానికి అత్యుత్తమ సేవలు అందుతాయి.
అందరిలోనూ ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు.
ఏదో ఒక విజయంతో నిత్యం అందరి చేత మెప్పు పొందుతారు.
కీర్తి ప్రతిష్ఠలు మరింత ఇనుమడిస్తాయి.
స్వగృహం, పెద్ద వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.
ఇంట్లో వివాహాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
ఆత్మీయులు, స్నేహితులతో విభేదాలు తొలగుతాయి.
నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తు ఏర్పడే సూచనలు.
ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు.
సంతాన విషయంలో శుభ వార్తలు వింటారు.
వ్యాపారవాణిజ్యవేత్తలు తగినంత పెట్టుబడులతో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా వాటిని అధిగమించి మీ సత్తా చాటుకుంటారు.
మొదటి మూడు నెలల్లో మంచి గుర్తింపు దక్కించుకుంటారు.
పారిశ్రామిక,శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి మనశ్శాంతి చేకూరుతుంది.
అవిశ్రాంత శ్రమ ఫలిస్తుంది.
రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కి ప్రజల్లో ఆదరణ పొందుతారు.
విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించే వీలుంది.
చిత్ర, టీవీ పరిశ్రమకు చెంది కళాకారుల ఆశలు నెరవేరతాయి.
వ్యవసాయదారులకు రెండోపంట అనుకూలిస్తుంది.
రాహుకేతువుల సంచారం వల్ల మానసిక ఆందోళన.
చిత్రవిచిత్ర సంఘటనలు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం.
పరిహారాలు...రాహుకేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.
అదృష్టసంఖ్య–5,