సింహం
ఆదాయం –8, వ్యయం–14, రాజపూజ్యం–1, అవమానం–5
ఈ రాశి వారికి గురువు అష్టమరాశి సంచారంతో మానసిక అశాంతి.
చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగకపోవడం. ఇతరుల సాయం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి.
బంధువర్గంతో అకారణంగా విరోధాలు. ఒత్తిడులకు లోనవుతారు.
అలాగే, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిది.
ఆహార నియమాలు పాటించడం ఉత్తమం.
ఇక శని సప్తమ రాశి సంచార సమయం మినహా మిగతా కాలమంతా శుభప్రదంగానే ఉంటుంది.
జ్ఞాతులతో నెలకొన్న వివాదాలు పరిష్కారంలో ముందడుగు వేస్తారు.
పూర్వీకుల ఆస్తులు అధిక ధరలకు విక్రయించడం ద్వారా ధన లబ్ధి కలుగుతుంది.
వివాహయత్నాలు కలిసివచ్చి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు జూలై నుండి ఫలిస్తాయి.
తీర్థయాత్రల పై అధిక శ్రద్ధ చూపుతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మొత్తానికి లాభాలు అందుకుంటారు.
అయితే, అధికారుల ద్వారా ఒత్తిడులు ఉండవచ్చు.
ఉద్యోగస్తులు తమ నైపుణ్యతను ప్రదర్శించి సహచరులకు ఆదర్శవంతంగా నిలుస్తారు.
మే, జూన్ మధ్యకాలంలో బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి.
పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఐటీరంగం వారికి కొంతమేర అభివృద్ధి కనిపిస్తుంది.
రాజకీయవేత్తలు కొత్త పదవులు అందుకున్నా కొన్ని సమయాలలో నిరాశ చెందుతారు.
విద్యార్థులకు శ్రమ ఫలించి తగిన ర్యాంకులు సాధిస్తారు.
చిత్ర పరిశ్రమ సహా కళాకారులకు మిశ్రమ ఫలితాలు దక్కుతాయి.
వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభించే వీలుంది.
రాహుకేతువుల సంచారం వల్ల తరచూ ప్రయాణాలు, మానసిక ఆందోళన ఉండవచ్చు.
పరిహారాలు...వీరు గురునికి పరిహారాలు, అమ్మవారికి అర్చనలు చేయించుకుంటే మేలు.
అదృష్ట సంఖ్య–1,