మీనం
ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–4.
వీరికి సెప్టెంబర్14 నుండి నవంబర్20 మధ్య గురుడు శుభుడు. మిగతా కాలం దోషకారి.
ఇక శని, రాహుకేతువులు శుభదాయకులు.
మొత్తం మీద గురుని వ్యయస్థితి కాలంలో వృథా ఖర్చులు.
సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
ముఖ్యంగా నరాల సంబంధిత రుగ్మతలు ఎదురుకావచ్చు.
సాహసకృత్యాలతో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొవలసిన పరిస్థితి, అప్రమత్తంగా మెలగండి.
అయితే శని స్థితి విశేషంగా లాభిస్తుంది.
ఆర్థిక వ్యత్యాసాలు తొలగి ధన నిల్వలు కనిపిస్తాయి.
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఇతరులను మెప్పించడం ద్వారా శత్రువులను దూరం చేసుకుంటారు.
ధైర్యసాహసాలు పెరిగి అనుకున్న కార్యాలు చక్కదిద్దుతారు.
ఒక దశలో ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉంటుంది.
ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు.
సోదరులతో కొన్ని విభేదాలు ఏర్పడినా సర్దుబాటు కాగలవు.
అలాగే, గురుని లాభస్థితి సంచార సమయంలోనూ శుభ వార్తలు.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
వివాహాది శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారు.
విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కుతాయి.
వ్యాపార, వాణిజ్యవర్గాలకు పెట్టుబడులకు మించి లాభాలు అందుతాయి.
ఉద్యోగులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పై అధికారుల మన్ననలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందుతారు.
పారిశ్రామికవర్గాలు, శాస్త్ర సాంకేతిక రంగాల వారికి ఇతోధికంగా లాభిస్తుంది.
వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలించడం విశేషం.
చిత్రపరిశ్రమ, రియల్ ఎస్టేట్ల రంగాల వారు మరింత ప్రగతిపథంలో సాగుతారు.
రాజకీయనాయకులు గౌరవంతో పాటు అనుకోని పదవులు పొందుతారు.
చేతివృత్తుల వారికి జీవనం ఆనందదాయకంగా ఉంటుంది.
మొత్తం మీద అన్ని రంగాల వారు రెట్టించిన ఉత్సాహంతో గడుపుతారు.
దోష పరిహారాలు...
వీరు గురువార నియమం పాటించడం, గురుదోష నివారణకు సెనగలు దానం చేయడం చేయాలి.
అలాగే, శివ స్తోత్రాలు పఠించడం ఉత్తమం.