వృషభం
ఆదాయం–8, వ్యయం –8, రాజపూజ్యం–6, అవమానం–6
వీరికి గ్రహసంచారం చాలావరకూ అనుకూలమని చెప్పాలి. రాహు, కేతువుల స్థితి ఒకింత ప్రతికూలమే అయినా గురు బలంతో నెట్టుకొస్తారు.
ఆర్థికంగా గతం కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ధన యోగాలు కలిగి నిల్వ చేస్తారు.
మంచి నడవడిక, శాంతికాముకులు, స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తులు పరిచయమవుతారు.
భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకుని అన్నింటా ముందడుగు వేస్తారు.
సంఘంలో మీకు గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
గృహ నిర్మాణ ఆలోచనలు సంవత్సరాంతంలో ఫలిస్తాయి.
ఆధ్యాత్మిక ప్రముఖులు మీకు మార్గదర్శనం చేస్తారు.
ఏ కార్యక్రమమైనా విజయవంతంగా ముగిస్తారు.
ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.
గురు బలం వీరికి అన్ని విధాలా ఉపకరిస్తుంది.
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొత్త ఆలోచనలతో పెట్టుబడులు, లాభాలు పొందుతారు.
ముఖ్యంగా సిమెంట్, ఐరన్, బంగారం, వెండి, అపరాల వ్యాపారులు మరింత లాభపడతారు.
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లుతో పాటు ఇతరుల పై ఆధిపత్యం చెలాయించే పోస్టులు రావచ్చు.
పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం వారు కొన్ని సమస్యలు, వివాదాల నుండి బయటపడతారు.
వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభసాటిగానే ఉండవచ్చు.
విద్యార్థులు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు.
చిత్రపరిశ్రమలోని వారికి మరిన్ని అవకాశాలు దక్కుతాయి.
అయితే జూలై నుండి వీరికి మరింత అనుకూలమని చెప్పాలి.
అయితే మొదటి మూడు నెలలపాటు శని దశమ స్థితి సంచారం కొన్ని చికాకులు కలిగించవచ్చు.
ముఖ్యంగా ఆరోగ్యం పై శ్రద్ధ చూపండి. వివాదాలకు మరింత దూరంకండి.
పరిహారాలు...వీరు రాహు, కేతువులు, జూలై నుంచి శనికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.
అదృష్ట సంఖ్య–6.